–ఆహార భద్రతపై డీఎల్‌ఏసీ సమావేశం… –రెసిడెన్షియల్‌ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు–జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద…

వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30  జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం ఆహార భద్రతపై జిల్లా స్థాయి సలహా కమిటీ (డీఎల్‌ఏసీ) సమావేశం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులు, చిన్నారులకు అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వంటశాలలు, ఆహార పదార్థాల నిల్వ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించేలా పర్యవేక్షించాలని...