Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 3:31 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

—ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఐక్యకూటమిని గెలిపించాలి… —ఎన్నికల సభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  పిలుపు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6

టీఎస్‌ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐక్యకూటమి అభ్యర్థులకు మద్దతుగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , కూడా చైర్మెన్ గుండు సుధారాణి  తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  హన్మకొండ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యకూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సంస్థను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లడంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడే సంఘాలకు అండగా నిలవాలని, ఎన్నికల్లో ఐక్యకూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. కార్మికుల గొంతుకగా నిలిచే నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ఆర్టీసీలో మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కేవలం సంఘాల మధ్య పోటీగా కాకుండా కార్మికుల భవిష్యత్‌, హక్కులు, సంక్షేమానికి సంబంధించిన ఎన్నికలుగా భావించి ప్రతి కార్మికుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించాలని కేఆర్ నాగరాజు  సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు,మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.