Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 2:55 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–ఆయిల్‌ఫామ్ రైతులు “అధికారుల సూచనలు పాటించాలి…మండల ఆయిల్‌ఫామ్ కమిటీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి సత్యనారాయణ రావు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 27

–51 ఎకరాల తోటలను సందర్శించి రైతులకు అవగాహన కల్పించిన మండల కమిటీ….

ఆయిల్‌ఫామ్ రైతులు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ తోటల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వర్ధన్నపేట మండల ఆయిల్‌ఫామ్ కమిటీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి సత్యనారాయణ రావు సూచించారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాలకు చెందిన ఏడుగురు రైతుల 51 ఎకరాల ఆయిల్‌ఫామ్ తోటలను కమిటీ సభ్యులు సందర్శించి సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చెట్ల పెరుగుదల, తోటల నిర్వహణ, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పులు, పంటపై పడే ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తోటల్లో కలుపు నివారణకు ఉపయోగించే యంత్రాలను పరిశీలించారు.అనంతరం రైతులు డ్రిప్‌ సిస్టమ్‌, నిచ్చెనల సబ్సిడీ, తోటల మీదుగా వెళ్తున్న విద్యుత్‌ స్తంభాల తొలగింపు, ఉచిత సోలార్‌ సిస్టమ్‌ల ఏర్పాటు తదితర సమస్యలను కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎర్రం నాగరాజు, మునుకుంట్ల ఐలయ్య, బలరాం,టి వేంకటేశ్వర్ రావు తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.