–అలీపురా బస్తీని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని…. —ముస్లిం కమ్యూనిటీ హాల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
హనుమకొండ అక్టోబర్ 3 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక...వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 59వ డివిజన్ అలీపురా బస్తీలో శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి పర్యటించారు. అలీపురా బడే మసీదు ఆవరణలో స్థానిక పరిస్థితులను పరిశీలించి, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ముస్లిం కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బస్తీలోని డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత...