-అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం— —గుడిసెలలో నివాసముంటున్న 168 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ కాపీలను అందజేసిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి—
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల టౌన్ మరియు పరకాల, నడి కూడా, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన గుడిసెలలో నివాసముంటున్న 168 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఆత్మకూరు మండలానికి 81, దామెర 17, నడికూడ 18, పరకాల మండలం 38, పరకాల టౌన్ 14 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్...