పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల టౌన్ మరియు పరకాల, నడి కూడా, దామెర, ఆత్మకూరు మండలాలకు చెందిన గుడిసెలలో నివాసముంటున్న 168 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఆత్మకూరు మండలానికి 81, దామెర 17, నడికూడ 18, పరకాల మండలం 38, పరకాల టౌన్ 14 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ… పేద ప్రజల సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చేదిద్దాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రధాన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగ ఇండ్లను ఇస్తున్నామని అన్నారు.పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ప్రలోభాలకు, పైరవీలకి తావు ఉండదు అని అన్నారు.ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు. గత బిఆర్ఎస్ నాయకులు ఇండ్లు ఇస్తానని మోసం చేశారని,గత ప్రభుత్వ పాలకుల నిర్వాహకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ప్రజాధనాన్ని పందికొక్కులాల దోచుకున్నారని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలని ఉద్దేశంతో ఏజెన్సీల ద్వారా పేద ప్రజలకు ఇండ్లను కట్టిస్తున్నామని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.