Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 2:31 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

—అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి….జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్య శారద…

–నవంబర్ 6వ తేదీలోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి…..జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్య శారద..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల జాబితాను 01.11.2026 అర్హత తేదీగా నిర్ణయించి నూతనంగా రూపొందిస్తున్న నేపథ్యంలో, జిల్లాలోని అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్య శారద కోరారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… భారత్ దేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని కలిగి ఉండి ,నిర్ణీత అర్హత తేదీకి కనీసం మూడు సంవత్సరాల ముందే ఆ డిగ్రీని పొందిన నియోజకవర్గ నివాసితులు దీనికి అర్హులు అని వారు పేర్కొన్నారు. ఓటు వేయడానికి,ఓటర్లు ప్రత్యేకంగా పట్టభద్రుల ఓటరు గా నమోదు చేసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరగబోయే పట్టభద్రుల ఎన్నికలకు అర్హత తేది01.11.2026 గా నిర్ణయించబడినదని,అందుకు ఓటరు 31 అక్టోబర్ 2023 నాటికి డిగ్రీ పూర్తి చేసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత పూర్తి చేసిన వారు పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు.అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా 06.11.2026 (శుక్రవారం) లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో https://ceotelangana.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు ఫారం-18తో పాటు డిగ్రీ సర్టిఫికెట్ ధ్రువీకరణ ప్రతిని, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో సంబంధిత సహాయ ఓటరు నమోదు అధికారి లేదా నియమిత అధికారులకు సమర్పించాలని తెలిపారు.జిల్లాలోని పట్టభద్రులందరు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులు భాగస్వాములు కావడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఓటర్ల జాబితా ముసాయిదా, తదుపరి ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితాను 30.12.2026న ప్రచురించనున్నట్లు తెలిపారు.నిర్ణీత గడువులోగా అర్హులైన ప్రతి పట్టభద్రుడు దరఖాస్తు చేసుకుని ఓటరు జాబితాలో తమ పేరు నమోదు అయ్యేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు.