—అయ్యప్పస్వామి పాదసేవలో… “పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్” —అయ్యప్పస్వామి ఆలయానికి రూ.11 లక్షల మహా విరాళం.. ఔదార్యం చాటుకున్న నవీన్ కుమార్ దంపతులు.. —అయ్యప్పస్వామి ఆశీస్సులతో ప్రజాసేవే లక్ష్యంగా నవీన్ కుమార్…

నర్సంపేట పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక  అక్టోబర్ 09 నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో నిర్వహించిన 21వ ఉత్తర ఫల్గుణ నక్షత్ర పడిపూజ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ముత్తోజిపేట గ్రామానికి చెందిన పడిదల మహాలక్ష్మి నవీన్ కుమార్ దంపతులు ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అయ్యప్పస్వామికి అష్టాభిషేకాలు, మహాకలశాభిషేకం, పుష్పాభిషేకం, పంబా ఆరాట్టు, పల్లకిసేవ నిర్వహించడంతో పాటు అన్నప్రసాద వితరణకు దాతలుగా వ్యవహరించారు. ఆలయ పునర్నిర్మాణానికి శాశ్వత స్థలదాతగా రూ.11 లక్షల విరాళాన్ని ప్రకటించి తమ భక్తిభావాన్ని, సేవా...