–అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న..

జీడబ్ల్యూఎంసీ, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9..నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.శుక్రవారం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని రెండో డివిజన్ గుండ్ల సింగారంలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నిర్మాణ నాణ్యతను తనిఖీ చేసి, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రజాధనంతో చేపడుతున్న ప్రతి...