Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 5:03 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

–అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న..

జీడబ్ల్యూఎంసీ, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9..నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.శుక్రవారం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని రెండో డివిజన్ గుండ్ల సింగారంలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నిర్మాణ నాణ్యతను తనిఖీ చేసి, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రజాధనంతో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణ ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకూడదని తెలిపారు. పనులను నిర్లక్ష్యంగా చేపట్టినా, నాణ్యతా లోపాలు గుర్తించినా సంబంధిత కాంట్రాక్టర్ల బిల్లుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. పనులన్నీ నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ తనిఖీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.