Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 5:04 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-అనూష మృతదేహానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  నివాళులు– –హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలో విషాద ఘటన—

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7

హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన వల్లాల అనూష అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  అనుష నివాసానికి వెళ్లి ఆమె మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  భరోసా ఇచ్చారు.అనూష ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రేణిగుంట్ల అశోక్ ,మండల సర్పంచ్ పురం అధ్యక్షులు రాకేష్ రెడ్డి, ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, మాజీ మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ కుమారస్వామి, హసన్పర్తి సొసైటీ డైరెక్టర్ ప్రభాకర్, గ్రామం ఉప సర్పంచ్ తిరుపతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.