MBBS విద్యార్థికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆర్థిక సాయం….. -వరుసగా రెండో ఏడాదీ కళాశాల ఫీజు చెల్లించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 పేదరికం కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.​ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామానికి చెందిన చిట్యాల నితిన్ అనే విద్యార్థి కష్టపడి చదివి ప్రతిష్టాత్మకమైన MBBS సీటు సాధించాడు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కళాశాల ఫీజు చెల్లించడం నితిన్ కుటుంబానికి భారంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం...