*22-A భూముల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు: డా. కోటూరి మానవతారాయ్..* *22-A భూముల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది – హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి..* *భూదాన్, వక్ఫ్ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం కఠిన చర్యలు తప్పవు..* *ఆక్రమణల వెనుక ఎంతటి రాజకీయ నాయకుల ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం..* *జర్నలిస్టుల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో సమన్వయం చేస్తాం – వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు అయూబ్..*
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక ; సెప్టెంబర్ 19 22-A నిషేధిత జాబితాలోని భూముల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి, వరంగల్ & హనుమకొండ సమన్వయకర్త డా. కోటూరి మానవతారాయ్ అన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు.. మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు… ఈ...