Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:01 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–16వ డివిజన్ లో ఘనంగా అన్నదానం: హాజరైన హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక  సెప్టెంబర్ 19

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరకాల నియోజకవర్గం పరిధిలోని 16వ డివిజన్ లోని మల్లీకుంట కట్ట మైసమ్మ తల్లి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రైజింగ్ సన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈ అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి గణనాథునికి, మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యువత అంతా ఒకటై ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. లంబోదరుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న రైజింగ్ సన్ యూత్ అసోసియేషన్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో రైజింగ్ సన్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పల్లెబోయిన సాకేత్, దుపాకి సంతోష్, సారయ్యలతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.