-స్వచ్ఛతలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్…. -50 ప్రగతి సిటీల్లో జీడబ్ల్యూఎంసీకి చోటు…. వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్ వెంకన్న,CMHO డాక్టర్ రాజారెడ్డి, MHO డాక్టర్ రాజేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక   జీడబ్ల్యూఎంసీ, సెప్టెంబర్ 29... స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) ఆధ్వర్యంలో మంగళవారం న్యూ ఢీల్లీ నుండీ నిర్వహించిన వికసిత్ భారత్ @2047 – స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పలు నూతన కార్యక్రమాలు, మార్గదర్శకాలను ఆవిష్కరించారు.ముఖ్యంగా SWM Rules–2026కు అనుగుణంగా నాలుగు రకాల...