-సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలి… -ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య… -ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ.. దిష్టిబొమ్మ దహనం…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 హనుమకొండ  AICC ఆదేశాల మేరకు, కేంద్ర ఎన్నికల సంఘంలో SIR లో జరిగిన "ఓటు చోరీ" అక్రమాలకు వ్యతిరేకంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో *వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు.ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులకు పాల్పడిన సి ఈ సి జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్...