-వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలో ఆకట్టుకున్న విద్యార్థుల కళాకృతులు— -విద్యార్థులను అభినందించిన జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న—

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ జీ డబ్ల్యుఎంసి,  సెప్టెంబర్ 28 స్వచ్ఛత హి సేవా –2026 కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్లో సోమవారం నిర్వహించిన ‘వేస్ట్ టు ఆర్ట్’ (వ్యర్థాల నుండి కళాత్మక వస్తువుల రూపకల్పన) పోటీల్లో విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక కళాకృతులు ఆకట్టుకున్నాయి.వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వ్యర్థ పదార్థాలను వినూత్నంగా పునర్వినియోగిస్తూ రూపొందించిన అలంకరణ వస్తువులు, బొమ్మలు, మొక్కల కుండీలు తదితర కళాఖండాలను ప్రదర్శించారు. "వ్యర్థాలను వనరులుగా మార్చి...