Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:53 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలో ఆకట్టుకున్న విద్యార్థుల కళాకృతులు— -విద్యార్థులను అభినందించిన జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న—

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ జీ డబ్ల్యుఎంసి,  సెప్టెంబర్ 28

స్వచ్ఛత హి సేవా –2026 కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్లో సోమవారం నిర్వహించిన ‘వేస్ట్ టు ఆర్ట్’ (వ్యర్థాల నుండి కళాత్మక వస్తువుల రూపకల్పన) పోటీల్లో విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక కళాకృతులు ఆకట్టుకున్నాయి.వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వ్యర్థ పదార్థాలను వినూత్నంగా పునర్వినియోగిస్తూ రూపొందించిన అలంకరణ వస్తువులు, బొమ్మలు, మొక్కల కుండీలు తదితర కళాఖండాలను ప్రదర్శించారు. “వ్యర్థాలను వనరులుగా మార్చి స్వచ్ఛమైన, పచ్చని నగర నిర్మాణంలో భాగస్వాములు కావాలి” అనే సందేశాన్ని ఈ ప్రదర్శన చాటిచెప్పింది.ఈ సందర్భంగా జీడబ్ల్యుఎంసి కమిషనర్ టి. వెంకన్న, సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ తదితరులు విద్యార్థులు ఏర్పాటు చేసిన కళాకృతుల ప్రదర్శనను పరిశీలించి, వారి సృజనాత్మకతను అభినందించారు. వ్యర్థాల తగ్గింపు, పునర్వినియోగం, రీసైక్లింగ్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం ద్వారా స్వచ్ఛత కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.అనంతరం ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమం లో శానిటరీ సూపర్ వైజర్ లు పసునూరి భాస్కర్ గోల్కొండ శ్రీను నరేందర్ తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ లు భీమయ్య భాషా నాయక్ రాజు తదితరులు పాల్గొన్నారు.