**వెదురును పెంచుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం* **ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, సెప్టెంబర్ 18: వెదురు పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విలువైన సహజ వనరుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.వెదురు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించనైనది.వెదురు ప్రకృతికి మిత్రుడు, ప్రజలకు ఉపాధి, భవిష్యత్తుకు భరోసానిచ్చే పునరుత్పాదక సహజ వనరుల్లో ఒకటని పేర్కొన్నారు.తక్కువ సమయంలో...