Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 9:35 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

వినాయక మండపాలను సందర్శించిన    పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రెడ్డి ..

పరివర్తన అవాజ్   తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 20

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పరిధిలనం, 29వ డివిజన్,51 వ డివిజన్, 6వ డివిజన్ పరిధిలో స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి  సందర్శించారు.ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు, భక్తులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు.గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. నిర్వాహకులు నాయిని నీలిమ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.

ఈ వేడుకల్లో వారి వెంట ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,మహిళలు భక్తులు కూడా ఉన్నారు.