*వినాయక నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేయాలి: బల్దియా కమిషనర్ టీ. వెంకన్న* ▪️ నిమజ్జన కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ▪️ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 19  వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆదివారం లోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.శనివారం నగర పరిధిలోని మడికొండ చెరువు, బంధం చెరువు, సిద్ధేశ్వర గుండం, ఉర్సుగుట్ట చెరువు, బేస్తం చెరువు, అగర్తల చెరువు, కట్టమల్లన్న చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువు, ముచ్చర్ల చెరువు, హసన్‌పర్తి, భీమారం చెరువు తదితర నిమజ్జన ప్రాంతాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన...