–వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…
పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20 హన్మకొండ వర్ధన్నపేట నియోజకవర్గంలోనీ 55వ డివిజన్ భీమారంలో నిర్వహించిన వినాయకుడి అన్నదాన కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె. ఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే నాగరాజు గారు ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షులు గడ్డం అరుణ్, ఎర్రగట్టుగుట్ట దేవస్థానం మాజీ చైర్మన్ మార్క రాజు, జిల్లా...