విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి… ఉపాధ్యాయులు తల్లిదండ్రుల తర్వాత మరో తల్లిదండ్రుల వంటివారు… హన్మకొండ ఎమ్మెల్యే నాయిని ..
పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20 హనుమకొండ. విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని శ్రీహర్ష కన్వెన్షన్‌లో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఎమ్మెల్యే నాయిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఒక...