Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:04 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

విఘ్నాలు తొలగించే భగవంతుడు గణనాథుడు : : బల్దియా ప్రత్యేక అధికారి/ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్* ▪️మహా అన్నదానాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, బల్దియా కమిషనర్…

 

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక ::   GWMC 19 సెప్టెంబర్ 2026

విఘ్నాలు తొలగించే దేవుడు గణనాథుడని బల్దియా ప్రత్యేక అధికారి/హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు.శనివారం నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయంలో ప్రతిష్టించిన గణనాథుని వద్ద కలెక్టర్,కమిషనర్ టి.వెంకన్న ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నదిపతి గణనాథుడని, వినాయకుణ్ణి పూజించడం వల్ల అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం అని నక్కల గుట్ట సర్కిల్ కార్యాలయం లో ప్రతి సం. వినాయకుణ్ణి ప్రతిష్టించి మహా అన్న దాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భం గా నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమం లో సూపరిండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఈ ఈ లు రవి కుమార్ మహేందర్ మాధవి లత డి ఈ లు రాజ్ కుమార్ కార్తీక్ రెడ్డి ఏ ఈ హరి కుమార్ కార్యాలయ సిబ్బంది కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.