వర్ధన్నపేట ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వెంటనే ప్రారంభించాలి

అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు గారు అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే ఉద్దేశంతో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక...