Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:52 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 హనుమకొండ

హనుమకొండ: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ సభ్యులు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రెడ్ క్రాస్ ప్యాట్రన్ నాయిని రాజేందర్ రెడ్డి  ని హనుమకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సమాజంలో ఆపదలో ఉన్న వారికి, పేదలు, నిరుపేదలు, రోగులు మరియు అవసరమైన వారికి రెడ్ క్రాస్ మరింత విస్తృతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.రక్తదానం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, థలసీమియా బాధితులకు సహాయం తదితర సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆయన సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.రెడ్ క్రాస్ సొసైటీ పాలక వర్గం మాట్లాడుతూ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  సూచనలు, సహకారంతో హనుమకొండ జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్: డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలక మండలి సభ్యులు: ఇ. వి. శ్రీనివాస్ రావు, కోశాధికారి: బొమ్మినేని పాపిరెడ్డి, జిల్లా పాలకవర్గసభ్యులు : బాశెట్టి హరిప్రసాద్, పుల్లూరి వేణుగోపాల్, బిల్లా రమణారెడ్డి, డాక్టర్. CH. సంధ్యారాణి, డాక్టర్. నల్ల సురేందర్ రెడ్డి, డాక్టర్. గొట్టిముక్కల శ్రీలక్ష్మి, ప్రొఫెసర్. సుంకరి జ్యోతి, కొక్కిరాల రాకేష్ పాల్గొన్నారు.