— రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు… -కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలి… -రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణపై  వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.సోమవారం రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.రాష్ట్ర...