రూ.1.43 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన.. రోడ్లు, డ్రైనేజీలు, అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తాం: ఎమ్మెల్యే నాయిని

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక హన్మకొండ 22 హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పెద్దమ్మగడ్డ కాలనీకి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ,హనుమకొండ  జిల్లా కలెక్టర్  చాహత్ బాజ్‌పాయ్ తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమ్మగడ్డ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతంగా...