Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:05 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–యూజీడీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ పనులను పరిశీలించిన కమిషనర్ వెంకన్న….

 

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19జిడబ్ల్యుఎంసి:సెప్టెంబర్ 19.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎంయూ) పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.శనివారం నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్, పీఎంయూ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన కార్యాలయ వసతులు, సాంకేతిక సదుపాయాలు, ఇతర మౌలిక ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.యూజీడీ ప్రాజెక్ట్ నగర మౌలిక వసతుల అభివృద్ధిలో కీలకమైనదని పేర్కొన్న కమిషనర్, సంబంధిత విభాగాల మధ్య సమన్వయంతో పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.