పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20
హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ముంజ బాలరాజు మృతి చెందగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మద్దునూరి చేరాలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సీతానగరంలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మద్దునూరి చేరాలు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం మాజీ సర్పంచ్‌గా ఆయన చేసిన సేవలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్మరించుకున్నారు.
చేరాలు గారి మృతి గ్రామానికి, ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేణుకుంట్ల అశోక్, ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి, మాజీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల మహేందర్, కార్యదర్శి బండ చంటి రెడ్డి, అనంతసాగర్ సర్పంచ్ రామంచ వెన్నెల దయాకర్, మడిపల్లి మాజీ సర్పంచ్ చిర్ర విజయ్ గౌడ్, 65వ డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్, 66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, మాజీ డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, సీతంపేట సీనియర్ నాయకులు తోకల లక్ష్మారెడ్డి నాయకులు ఐలన్న, వెంకటస్వామి, సురేందర్ రెడ్డి, జొన్న రవీందర్, వాసికుల శ్రీనివాస్, జన్ను అశోక్,రణధీర్,సదానందం,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.