Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 1:41 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్యం, బ్రాండింగ్, మార్కెటింగ్‌లో ప్రోత్సాహం వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు… -పప్పు మిల్లు ఆధునీకరణ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై వీ హబ్ సంస్థతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం…

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  సెప్టెంబర్ 29:

జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం
వర్ధన్నపేట నియోజక వర్గ అభివృద్ది పై వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గార్లు వీ హబ్ సంస్థ డైరెక్టర్ ఊహ, వారి బృందంతో కలిసి సంబధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష లో
మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వారు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన బ్రాండింగ్, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యల పై సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్న జీవనోపాధి, ఉత్పత్తుల తయారీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ఆధునిక నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల నాణ్యత పెంపు, బ్రాండింగ్, మార్కెటింగ్‌కు అవసరమైన సదుపాయాల కల్పనపై చర్చించారు.గ్రామీణ ప్రాంత మహిళలకు స్థానిక వనరుల ఆధారంగా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీ హబ్ ద్వారా అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు సూచించారు.మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా నైపుణ్య శిక్షణతో పాటు ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.అనంతరం వీ హబ్ బృందం పర్వతగిరి మండలంలోని పప్పు మిల్లు ఆధునీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను, అలాగే వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఏర్పాటు చేయనున్న ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించాలని సంబధిత అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీవో నాగ పద్మజ, వరంగల్ ఆర్డీవో సుమ ,వర్ధన్నపేట తహసిల్దార్ విజయ్ సాగర్, వీ హబ్ డైరెక్టర్ ఊహ వారి బృంద సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.