బొల్లోనిపల్లిమండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల లెక్కల సామర్థ్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

  పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక  వరంగల్, సెప్టెంబర్ 19: బొల్లోనిపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను, శనిగారం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. వారి లెక్కల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు గణితంలోని వివిధ అంశాలపై ప్రశ్నలు వేసి, వారు సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠ్యాంశాలపై అవగాహనను పరిశీలించారు.అనంతరం పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు,...