బల్దియాలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27: మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కమిషనర్ జోనా, అధికారులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ జోనా మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని సైతం త్యజించిన నిబద్ధత...