—ప్రజా సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి: బల్దియా కమిషనర్ టి. వెంకన్న….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 జిడబ్ల్యూఎంసి ప్రజల నుంచి స్వీకరించే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు.సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి 92 దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగాలకు బదలాయించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో...