పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ *వరంగల్ వెస్ట్ నియోజకవర్గం పరిధిలోని 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏనుగుల మానస రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం మహా అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రకాష్‌రెడ్డిపేట లోని ఐడియల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణనాథుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమ నిర్వాహకులు, మాజీ కార్పొరేటర్ మానస రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను డివిజన్ ప్రజల సహకారంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా స్వామివారి కృపతో పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ పరిధిలోని కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.