–పారిశుద్ధ్య నిర్వహణపై ఉప కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలి.. —క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ.. లోపాలు కనిపిస్తే తక్షణమే సరిదిద్దాలి… –జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న—

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ జీడబ్ల్యూఎంసీ, సెప్టెంబర్ 28: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉప కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కమిషనర్ పలు సూచనలు చేశారు. రోజువారీ చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు,...