Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:43 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీఏసీఎస్ చైర్మన్ బయ్యగోని కుమారస్వామి: హసన్‌పర్తి మండల కాంగ్రెస్ ముఖ్య సమావేశం

 

పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20 హన్మకొండ

హసన్‌పర్తి మండలం మల్లారెడ్డి పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్‌గా నూతనంగా నియమితులైన బయ్యగోని కుమారస్వామి ఆదివారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కుమారస్వామికి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.ఈ భేటీ అనంతరం ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి సమక్షంలో హసన్‌పర్తి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణ మరియు ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నూతన పీఏసీఎస్ చైర్మన్ బయ్యగోని కుమారస్వామితో పాటు హసన్‌పర్తి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.