—జ్ఞానేశ్వర్ కుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి .. —హనుమకొండ డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ,ఎంపీ..

హనుమకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 దేశ ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ జరిపించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  డిమాండ్ చేశారు. ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏఐసీసీ ఆదేశాల మేరకు సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన...