Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 11:05 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అయూబ్ …

 

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ గణపతి ఉత్సవ కమిటీల నాయకులు, నిర్వాహకుల ఆహ్వానం మేరకు వరంగల్ మాజీ ఎంపీ పసునూరి దయాకర్ గారితో కలిసి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మహమ్మద్ అయూబ్ గారు పలు గణపతి మండపాలను సందర్శించారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షుడు అయూబ్ గారిని శాలువతో సత్కరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్స్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు….