–గడ్డి మందుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పోరాటానికి ఫలితం… –కేంద్ర వ్యవసాయ శాఖకు ఎంపీ డా. కడియం కావ్య కృతజ్ఞతలు..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 హనుమకొండ రైతులు, గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్సభ వేదికగా చేసిన పోరాటానికి కీలక ఫలితం లభించింది. పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగంపై ప్రమాదాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మార్చి 27న లోక్సభ జీరో అవర్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆ తర్వాత పరిణామాల్లో తెలంగాణ శాసనసభ కేంద్రాన్ని సంపూర్ణ నిషేధం...