ఖర్చెంతైనా బాధ్యత నాదే.. -రహీమున్నీసా బేగం ఆరోగ్యానికి ఎమ్మెల్యే నాయిని భరోసా..

పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20 హన్మకొండ జీవితం మొత్తం కుటుంబం కంటే సమాజం కోసం పాటుపడిన ఉద్యమకారిణికి అండగా ఉంటానని  రహీమున్నీసా బేగం కుటుంబానికి హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హమీ ఇచ్చారు.హనుమకొండ: ఉద్యమ సమయంలో ప్రజల కోసం, సమాజం కోసం ముందుండి పోరాడిన ఉద్యమకారిణి రహీమున్నీసా బేగం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  ఆమెను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఊపిరితిత్తుల సమస్యతో హనుమకొండలోని ఏకశిలా ఆసుపత్రిలో చికిత్స...