Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 2:31 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

పరివర్తన  అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆచార్య  కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 111వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ , వివేక్  తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  మాట్లాడుతూ… కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడంతో పాటు తెలంగాణ హక్కులు, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి కోసం బాపూజీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే  తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.