పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 20 హన్మకొండ
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఆదివారం కడిపి కొండ మరియు పరకాల పట్టణాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదివారం 45వ డివిజన్ కడిపికొండలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కర్ర హరీష్ రెడ్డి ఆహ్వానం మేరకు, పైడిపాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన గణనాథుని మండపాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డివిజన్ పరిధిలో భక్తిభావం వెల్లివిరియడం ఎంతో సంతోషకరమన్నారు. లంబోదరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరి విఘ్నాలు తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన సేవా కార్యక్రమాన్ని మరియు అన్నదానాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్గా సొసైటీ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటరమణ రావు, 44వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల సదానందం, సీనియర్ నాయకులు వేణు, సుధాకర్, రమేష్, కోటిలతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పరకాల పట్టణంలో ప్రసిద్ధ శ్రీ పోచమ్మ తల్లి ఆలయాన్ని, శివలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. వివిధ అసోసియేషన్లు, కాలనీవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సందర్శించి ఆన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విఘ్న వినాయకుని నవరాత్రి ఉత్సవాలు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరగడం సంతోషకరమన్నారు. ఆ లంబోదరుని ఆశీస్సులతో నియోజకవర్గ, జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని ఆయన ప్రార్థించారు.