Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 3:14 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

ఎస్‌ఐఆర్‌లో 39,855 హియరింగ్స్‌ పూర్తి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

 

పరివర్తన అవాజ్ వరంగల్  సెప్టెంబర్ 19

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 1,94,395 నోటీసులు జారీ చేయగా, 39,855 హియరింగ్స్‌ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.103 నర్సంపేట 13,460,106 వరంగల్ తూర్పు 10,236,107 వర్ధన్నపేట 15,495 నియోజగా వర్గాల వారిగా హియరింగ్స్‌ నిర్వహించినట్లు వెల్లడించారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అందిన నోటీసులపై హియరింగ్స్‌ను నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేసి, తదుపరి ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.