Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 9:33 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్ సభ్యులు..

పరివర్తన అవాజ్  సెప్టెంబర్ 20 హన్మకొండ

మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్ సొసైటీ సభ్యులు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.అనంతరం సొసైటీ చైర్మెన్ బయగోని కుమారస్వామిని, సభ్యులను ఎమ్మెల్యే గారు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.పీఏసీఎస్ సొసైటీ అభివృద్ధితో పాటు రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గాజు కృష్ణవేణి యుగంధర్ యాదవ్,కొత్తపల్లి సర్పంచ్ సాంబయ్య, అర్వపల్లి సర్పంచ్ ప్రభాకర్, హరిచంద్రనయక్ తండా సర్పంచ్ దేవేందర్,బైరంపల్లి సర్పంచ్ సురేందర్,సుదనపల్లి సర్పంచ్ లక్ష్మీ లింగస్వామి,సీతానగరం సర్పంచ్ రామ రమేష్, మల్లారెడ్డిపల్లి ఉపసర్పంచ్ కుమారస్వామి,సీనియర్ నాయకులు జేట్టి యుగంధర్,మంద రాజు,అనిల్,బత్తుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.