Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 4:30 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర ప్రముఖులతో కలిసి తిలకించిన   “ది ప్యారడైజ్” సినిమా….

పరివర్తన. అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 

ప్రముఖ దర్శకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీకాంత్ ఓదెల కథానాయకుడు నానీతో తీసిన “ది ప్యారడైజ్” సినిమాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి,అనిల్ జాదవ్,పార్టీ నాయకులు తిలకించారు.తెలంగాణకు సంబంధించిన ఇతివృత్తంతో నిర్మించిన ఈ సినిమాలోని పాత్రలన్నీ కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడడంతో విడుదలైన కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ఆదరణ విశేషంగా చూరగొన్నది.ఈ సందర్భంగా శనివారం రాత్రి కేటీఆర్,రవిచంద్ర, శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,వెంకటేష్, లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్,జాన్సన్ నాయక్, రాకేష్, పార్టీ నాయకులు, పలువురు అభిమానులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎంఎంలో “ది ప్యారడైజ్” సినిమాను ఇతర ప్రేక్షకులతో కలిసి వీక్షించారు.