Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:01 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

*ఆపదలో ఉన్న వారికి ఆర్థిక భరోసా.. LOC చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక ::  సెప్టెంబర్ 19

వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  అన్నారు. వైద్య చికిత్స అవసరాల కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) చెక్కులను లబ్ధిదారులకు హైదరాబాద్ లోని వారి నివాసంలో అందజేశారు.
ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన తంజీలకు రూ.2,50,000, హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బండి మంజులకు రూ.2,50,000 విలువైన LOC చెక్కులను ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు  అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలిచి, వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిర్ర విజయ్,శ్రీరాములు,తిరుపతి, మహేందర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.