Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 11:25 am Posted by : parivarthanaawaaz

భారీగా తగ్గిన బంగారం ధరలు

                భారీగా తగ్గిన బంగారం ధరలు

పరివర్తన అవాజ్  అక్టోబర్ 30 2025,  భారీగా తగ్గిన బంగారం ధరలు గత రెండు మూడు రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,20,490కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,10,450కి పడిపోయింది. వెండి ధర కూడా రూ.1000 తగ్గి కిలో రూ.1,65,000గా ఉంది. ఈ ధరల తగ్గుదల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే విధంగా ఉంది.